Monday, June 5, 2023

Breaking : పెండింగ్ లో ఉన్న జ‌డ్జీల పెంపు ఎట్ట‌కేల‌కు పూర్త‌యింది – సీజేఐ ఎన్వీర‌మ‌ణ

రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న జ‌డ్జీల పెంపు ఎట్ట‌కేల‌కు పూర్త‌యింద‌ని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. తెలంగాణ స్టేట్ జ్యూడీషియ‌ల్ ఆఫీస‌ర్స్ కాన్ఫ‌రెన్స్ స‌ద‌స్సు హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో జ‌రిగింది. ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు..న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారాయ‌న‌. ఎక్కువ‌మంది జ‌డ్జీల‌ను నియ‌మించి న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌ర‌చాల‌ని భావించాం అన్నారు. గ‌త రెండేళ్ల‌లో ఎక్కువ మంది జడ్జీల నియామ‌కం జ‌రిగింద‌న్నారు. జిల్లా కోర్టుల్లో జ‌డ్జీల సంఖ్య పెంచుతున్నాం అన్నారు సీజేఐ. సీఎం కేసీఆర్ అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement