Wednesday, October 9, 2024

Breaking : భారత్ జోడో యాత్రలో బాలిక కాలికి చెప్పులు తొడిగిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ కీల‌క‌నేత రాహుల్ గాంధీ కేరళలోని హరిపాడ్ నుంచి భారత్ జోడో యాత్రను పునఃప్రారంభించారు.ఈ పాదయాత్ర ఆదివారం 11వ రోజుకు చేరుకుంది. అలప్పుజా జిల్లా అంబలప్పుజా పట్టణంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పాదయాత్రలో ఓ బాలికకు పాదరక్షలు ధరించేందుకు సహాయం చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ఆయన మానవీయ స్పర్శ ఉన్న నాయకుడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ పాదయాత్రలో ఆయన వెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కే మురళీధరన్‌, రమేష్‌ చెన్నితాల, కేసీ వేణుగోపాల్‌, కొడికున్నిల్‌ సురేష్‌ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement