Wednesday, April 24, 2024

Breaking _ సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌కి శుభం కార్డు ప‌డిన‌ట్లే – చిన్న చిత్రాల‌కు ఐదు షోల‌కి అనుమ‌తి

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి శుభం కార్డు పడిందని భావిస్తున్నట్లు నటుడు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సీఎం జగన్‌ నిర్ణయం మమ్మల్ని అందరినీ సంతోషపరిచిందని తెలిపారు. జగన్‌తో భేటీ అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ..చిన్న సినిమాలకు ఐదు షోకు అనుమతించడం శుభపరిణామని చెప్పారు. ఈ నెల మూడో వారంలో సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారాలకు సంబంధించి ప్రభుత్వం జీవో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 2వారాల్లో టాలీవుడ్ కి గుడ్ న్యూస్ చెప్పేలా ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు రానున్నాయి. ఈ మేరకు సీఎం జ‌గ‌న్ కి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ త‌ర‌పున , ప్రభుత్వ పెద్దలకు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేర‌కు సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌కు శుభంకార్డు ప‌డింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement