Tuesday, March 26, 2024

Breaking : త‌ల‌సానితో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ .. థియేట‌ర్లు మూసే ఆలోచ‌న లేదన్న మంత్రి ..

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేప‌థ్యంలో మాల్స్ తో పాటు థియేట‌ర్స్ మూసివేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్యలతో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలు అంటూ జరుగుతున్న ప్రచారం తదితర అంశాలపై వారు మంత్రితో చర్చించారు.ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ ప్రవేశించిందన్న వార్తలతో సినీ రంగం ఆందోళన చెందుతోంది.

రానున్న సంక్రాంతి సీజన్ లో పలు పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ డిసెంబరులోనూ పలు చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు మంత్రిని కలిసినట్టు సమాచారం. దీనికి స్పందించిన మంత్రి త‌ల‌సాని ప్ర‌జ‌ల‌కు అభ‌య‌మిచ్చారు. థియేట‌ర్ల‌కు వెళ్ళి ధైర్యంగా సినిమా చూడండ‌ని చెప్పారు. థియేట‌ర్ల మూత‌, ఆక్యుపెన్సీ త‌గ్గింపు ప్ర‌చారాన్ని న‌మ్మొద్ద‌ని తెలిపారు. అలాంటి ఆలోచ‌న‌లు ప్ర‌భుత్వానికి లేవ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement