Thursday, March 28, 2024

Breaking : గ్రీక్ ద్వీపం ఫెర్రీలో మంట‌లు – 11మంది గ‌ల్లంతు

గ్రీక్ ఐస్ ల్యాండ్ ద్వీపంలో ఫెర్రీలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో 11మంది గ‌ల్లంత‌య్యారు. ఈ మంట‌ల్లో ఇద్ద‌రు చిక్కుకున్నారు. గ్రీక్ లోని కోర్ఫు తీరంలో మంటలు చెలరేగాచి.. ఫెర్రీలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తుల కోసం రెస్క్యూ మిషన్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. నౌకలో ఉన్నవారి అధికారిక జాబితాలో లేని ఒక వ్యక్తితో సహా మొత్తం 278 మంది వ్యక్తులను కోర్ఫులో సురక్షితంగా తరలించినట్లు సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇన్సులర్ పాలసీ మీడియాకు తెలియజేసింది. ఫెరీ ఒలింపియాలో 239 మంది ప్రయాణికులు ,51 మంది సిబ్బంది ఉన్నార‌ని ఓడ కెప్టెన్ ఇగోమెనిట్సాలోని ఓడరేవు అధికారులకు సమర్పించిన అధికారిక జాబితాల ప్రకారం తెలిసింద‌ని గ్రీక్ కోస్ట్ గార్డ్ సీనియర్ అధికారి నికోస్ లగాడియానోస్ మీడియా సమావేశంలో వెల్ల‌డించారు. కోస్ట్ గార్డ్ నౌకలు ఘ‌ట‌నాస్థలికి చేరుకున్నాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి టగ్‌బోట్‌లు యూరోఫెరీ ఒలింపియాకు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాయి. 1995లో, యూరోఫెరీ ఒలింపియా ప్రారంభించబడింది. “గ్రిమాల్డి గ్రూప్ టాప్ మేనేజ్‌మెంట్ ఈ విషాదానికి విచారం వ్యక్తం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement