Friday, April 19, 2024

Breaking : క్రిప్టో క‌రెన్సీ కాటుకి బ‌ల‌యిన రామ‌లింగ‌స్వామి..

ప్రాణాలు తీస్తోంది క్రిప్టో క‌రెన్సీ. ఆర్ధిక న‌ష్టాల‌తో రామ‌లింగ‌స్వామి అనే వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. సూర్యాపేట‌లోని ఓ లాడ్జిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు రామ‌లింగ‌స్వామి. ప్రైవేట్ స్కూల్ పెట్టి స‌క్సెస్ కాలేక‌పోవ‌డంతో క్రిప్టో క‌రెన్సీ వైపు మ‌ళ్ళాడు రామ‌లింగ‌స్వామి. క్రిప్టో క‌రెన్సీలో స‌భ్యుల‌ను చేర్పించాడు. క్రిప్టో క‌రెన్సీ నుంచి రావాల్సిన రూ. 70ల‌క్ష‌ల సొమ్ము రాక‌పోవ‌డంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌య్యాయి. స‌భ్యుల నుంచి ఒత్తిడి రావ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కాగా రామ‌లింగ‌స్వామిని కిడ్నాప్ చేసి బ‌ల‌వంతంగా కారు,బంగారాన్ని లాక్కున్నాడు శివ‌పురం స‌ర్పంచ్. ఇంకా డ‌బ్బులు ఇవ్వాల‌ని ఒత్తిడి చేయ‌డంతో ఆత్మ‌హ‌త్య‌కి పాల్ప‌డ్డాడు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement