Friday, April 26, 2024

Breaking : ప్ర‌ధాని మోడీ నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో సీఎం ‘కేసీఆర్’ బ‌ర్త్ డే హోర్డింగ్స్

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన‌రోజు ఫిబ్ర‌వ‌రి 17న‌. కాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసి ప్రధాన కూడళ్లలో కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్ లు వెలిశాయి. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశాడు. ప్రస్తుతం వారణాసిలో స్థిరపడ్డ తర్వాత కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల ఉన్న అపారమైన అభిమానం తో వారణాసి లోని చౌక ఘాట్, ఫాతమాన్ రోడ్డు, రథయాత్ర , ప్రధాన కూడళ్ళలో హోర్డింగ్ ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియ‌జేశాడు. ప్రధానమంత్రి నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హోర్డింగులు ప్రధాన ఆకర్షణగా ,చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement