Wednesday, March 27, 2024

Breaking : డెత్ డే గా మారిన .. బ‌ర్త్ డే పార్టీ .. అస‌లేం జ‌రిగింది ..

బ‌ర్త్ డే పార్టీస్ ..ఈ మ‌ధ్య‌కాలంలో ఈ ట్రెండ్ బాగా పాపుల‌ర్ అవుతుంది. ఫ్రెండ్ అంటే ప్రాణ‌మిచ్చే స్నేహితుల‌యితే ఈ వేడుక‌ని జ‌ర‌ప‌డంలో ముందుంటారు. ఆ స్నేహితురాలు మ‌ర‌చిపోని విధంగా పుట్టిన‌రోజుని జ‌రిపేందుకు ప్లాన్ చేస్తుంటారు. అచ్చు ఇలాగే జ‌రిగింది ఓ సంఘ‌ట‌న‌.. కాక‌పోతే ఆ బ‌ర్త్ డే వేడుక‌లు విషాదంతో ముగిశాయి.. బ‌ర్త్ డే కాస్త డెత్ డే గా మారిపోయింది. వివ‌రాలు చూస్తే త‌మ స్నేహితురాలి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ కోసం ప‌లువురు కేక్ క‌ట్ చేయించారు. ఇంత‌వ‌ర‌కు ఓకే..కానీ ఆ వేడుక‌లు శృతి మించాయి..

బ‌ర్త్ డే గర్ల్ ని చేతులు ..కాళ్ళు ప‌ట్టుకుని ఉయ్యాల‌లా ఊప‌డ‌మే కాదు కేక్ మొత్తం ఆమె ముఖానికి పూశారు. ఆ కేక్ ని తుడుచుకునే ప‌రిస్థితిలో లేదు ఆ అమ్మాయి.. దాంతో ఊపిరి ఆడ‌క మృతి చెందింది. ఈ వీడియో మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వేడుక‌లు మంచిదే కానీ ప్రాణం తీసేంత‌గా ఉండ‌కూడ‌ద‌ని వీరికి ఇప్ప‌టికైనా జ్ఞానోద‌యం అయివుంటుంది. వీరి పిచ్చి చేష్ట‌ల‌తో ఒక నిండు ప్రాణం బ‌ల‌యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement