Saturday, November 27, 2021

Breaking : మోడీతో భేటీ కానున్న మ‌మ‌తాబెన‌ర్జీ..

బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత మొద‌టిసారిగా బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీ తొలిసారిగా ఢిల్లీకి వ‌చ్చారు. ఈ నెల 29నుంచి పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల‌కు ముందు ఆమె రాక రాజ‌కీయంగా ఆస‌క్త‌ని రేపింది. కాగా దీదీ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతో భేటీ కానున్నారు. నేటి సాయంత్రం 5గంట‌ల‌కు భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బీఎస్ఎఫ్ పరిధి పెంపు అంశంతో పాటు, బెంగాల్ అభివృద్ధిపై మోడీతో చ‌ర్చించ‌నున్నారు. ఇటీవల బెంగాల్లో బీఎస్ఎఫ్ జ్యూరిడిక్షన్ పెంపు అంశంపై టీఎంసీ పార్టీ గుర్రుగా ఉంది.

పంజాబ్, అస్సాం, పశ్చిమబెంగాల్ లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్లుగా ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎవరి అనుమతులు లేకుండా బీఎస్ఎఫ్ చర్యలు తీసుకోవచ్చు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, బంగ్లాదేశ్‌తో పశ్చిమ బెంగాల్ సరిహద్దులు పూర్తిగా శాంతియుతంగా ఉన్నాయని మమతా బెనర్జీ ఇటీవల తెలిపారు. ఈ మేర‌కు ఈ అంశంపై కూడా ఆమె చ‌ర్చించే ఛాన్స్ ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News