Thursday, March 28, 2024

Breaking : ఏపీ నైట్ క‌ర్ఫ్యూలో మార్పులు – ఈ నెల 18 నుండి 31వ‌ర‌కు

ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌లు మార్పులు చేసింది. సంక్రాంతి ప‌ర్వ‌దినం త‌ర్వాతే రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర స‌ర్కార్ నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఈ నెల 10వ తారీఖు నుండే ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ అమలు అవుతోంది. ఏపీ ప్ర‌జ‌లు సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా పెద్ద ఎత్తున త‌మ స్వ‌గ్రామాల‌కు త‌ర‌లి వెళ్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంది రాష్ట్ర స‌ర్కార్. నైట్ క‌ర్ఫ్యూ వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని ప‌లు ఈ మార్పులు చేసిన‌ట్టు వెల్ల‌డించింది ప్ర‌భుత్వం. కాగా ఈ నెల 18నుండి 31వ తేదీ వరకు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటామ‌ని చెప్పింది. క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని ఆళ్ల నాని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ మాస్క్ ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement