Monday, April 15, 2024

Breaking : సినిమా ప్ర‌మోష‌న్ కోసం అరాచ‌కం..స్పాట్ లో ఉన్న హీరో విశ్వ‌క్ సేన్

సినిమా ప్ర‌మోష‌న్ లో న్యూసెన్స్ చోటు చేసుకుంది.ప‌బ్లిసిటీ కోసం న‌డిరోడ్డుపై అరాచ‌కాన్ని సృష్టించారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం పేరుతో డ్రామాలు ఆడారు. ఈ స్పాట్ లో హీరో విశ్వ‌క్ సేన్ వున్నాడు. సినిమా హీరోనే ప్ర‌మోష‌న్ కోసం డ్రామాలు ఆడారు.ప‌క్క‌నే ఉండి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం సీన్లు పండించారు. న‌డిరోడ్డుపై డ్రామాలు చేయ‌డంపై జ‌నాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం అనేది క్రైమ్ అని తెలియాదా అన నిల‌దీస్తున్నారు. అభిమానుల‌కు ఇచ్చే సందేశం ఇదేనా అంటున్నారు. సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఇంత అర‌చ‌క‌మా..హీరో స‌హా అక్క‌డ వున్న‌వారిపై కేసులు పెట్టాలంటున్నారు యాక్టివిస్టులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement