Thursday, April 25, 2024

Breaking : ప్ర‌జ‌ల‌పై మ‌రో ప‌న్ను భారం..

అమ‌రావ‌తి రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌పై మ‌రో ప‌న్ను భారం ప‌డ‌నుంది. మోటారు వాహ‌నాల ప‌న్ను చ‌ట్టం 1963లో స‌వ‌ర‌ణ‌ల‌కు అసెంబ్లీలో బిల్ ప్ర‌వేశ‌పెట్టారు. వాహ‌నాల లైఫ్ టాక్స్, గ్రీన్ టాక్స్ పెంపున‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. నూత‌న వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో ఇక‌పై 13,14,17,18శాతం చొప్పున లైఫ్ టాక్స్ విధించేందుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసింది. ఈ ట్యాక్సుల పెంపు ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై రూ. 410కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నుంది. 2019-21లో ర‌వాణాశాఖ‌కు రూ.3,181కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. వైఎస్ ఆర్ వాహ‌న మిత్ర‌కు ఏడాదికి రూ.240కోట్లు ఖ‌ర్చు చేస్తోంది ప్ర‌భుత్వం. ఆటో,సొంత క్యాబ్స్ ఉన్న వారికి వాహ‌న మిత్ర పథ‌కం వ‌ర్తిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement