Friday, March 29, 2024

Breaking : అక్త‌ర్ హుస్సేన్ ల‌ష్క‌ర్ అనే – అనుమానిత ఉగ్ర‌వాది అరెస్ట్

ఫుడ్ డెలివ‌రీ బాయ్ గా పని చేస్తూ ఇత‌రుల‌తో క‌లిసి నివాసం ఉంటోన్న అసోంకి చెందిన అక్త‌ర్ హుస్సేన్ ల‌ష్క‌ర్ అనే అనుమానిత ఉగ్ర‌వాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న బెంగ‌ళూరులో క‌ల‌క‌లం రేపింది. సెంట్రల్ క్రైమ్‌ బ్రాంచ్‌ (CCB) స్పెషల్‌ వింగ్‌, అంతర్గత విభాగం (ISD), ఇంటెలిజెన్స్‌ వింగ్‌ల సమన్వయంతో టిలక్‌నగర్‌లోని ఓ నివసాంపై దాడి చేశారు. . అతనితో పాటు మరో నలుగురిని కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. అయితే ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం అదుపులో తీసుకున్నవారిని పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement