Thursday, April 25, 2024

Breaking : 57 రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌కు – షెడ్యూల్ విడుద‌ల‌

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆయా రాజ్య‌స‌భ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. రాజ్య‌స‌భ‌లో త్వ‌ర‌లో ఖాళీ కానున్న 57 స్థానాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు స‌హా 15 రాష్ట్రాల‌కు చెందిన ఈ స్థానాల‌కు జూన్ 10న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌లకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ నెల 24న నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నుంది. ఏపీలో 4 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏపీలో వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి స‌హా.. బీజేపీ స‌భ్యులుగా ఉన్న సుజ‌నా చౌద‌రి, సురేశ్ ప్ర‌భు, టీజీ వెంక‌టేశ్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. తెలంగాణ‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, డి. శ్రీనివాస్‌ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ స్థానాల‌ను భ‌ర్తీ చేసేందుకే కొత్త‌గా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement