Tuesday, April 23, 2024

Brave: ఆ మ‌హిళ చాలా గ్రేట్‌.. దానికి చెప్పు చూపి బెదిరించింది..

మీరు ఏదైనా ప్రాజెక్టు ఒడ్డున నిలబడి ఉన్నారనుకోండి.. దానిలో నుంచి ఒక పెద్ద మొసలి మీ వైపు వ‌స్తుంటే అప్పుడు మీరేం చేస్తారో ఊహించుకోండి.. వెంట‌నే పారిపోతారా.. లేక దాని తోక‌ప‌ట్టుకుని ఫైట్ చేస్తారా.? ఒక‌సారి సీరియ‌స్‌గా దీనిగురించి ఆలోచిద్దురు కానీ.. ఈ మహిళ చేసిన ప‌ని మాత్రం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఒక మహిళ తన పెంపుడు కుక్కతో నది ఒడ్డున‌ నిలబడింది.. అప్పుడు పొడవాటి మొసలి ఆమె వైపు దూసుకొచ్చింది.. దాన్ని చూసిన ఆ మహిళ ఏం చేసిందంటే?

చెప్పు చూపించి ద‌డ పుట్టించింది..
పొడవాటి మొసలి ఆ మహిళ వైపు వ‌స్తుంటే అక్క‌డి నుంచి పారిపోకుండా.. అక్క‌డే నిలబడి కాలికి ఉన్న చెప్పు తీసింది.. దాన్ని చూపిస్తూ.. ఆ మొస‌లిని బెదిరించింది.. అంతేకాకూండా ఇంకొంచెం ముందుకు వెళ్లి తన చేతిపై చెప్పుతో కొడుతూ బెదిరించింది. ఆ మొసలికి ఏం అర్థం అయ్యిందో ఏమో కానీ, అక్కడి నుండి భయపడి వెనక్కి నీటిలోకి జారుకుంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AvatarDomy2/status/1424094239974170625
Advertisement

తాజా వార్తలు

Advertisement