Thursday, April 25, 2024

Bangarraju: బాయ్‌కాట్ ‘బంగార్రాజు’… నాగార్జునపై విమర్శలు

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల తగ్గింపు వ్యవహారం సినీ ఇండస్ట్రీలో చిచు రేపుతోంది. కొందరు ఏపీ ప్రభుత్వంపై బహిరంగా విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమకు ఏం ఇబ్బంది లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సినిమా టికెట్ల అంశంపై ఇటీవల హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలపై కొందరు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఏపీలోని ఎగ్జిబిట‌ర్స్ ఈ విష‌యంలో నాగార్జునపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.

నాగార్జున, నాగ చైత‌న్య హీరోలుగా న‌టించిన బంగార్రాజు సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన RRR, రాధే శ్యామ్‌, భీమ్లా నాయ‌క్ వంటి భారీ చిత్రాలు కోవిడ్ ప్ర‌భావం కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. దీంతో బంగార్రాజు సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవల జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టికెట్ రేట్స్ త‌గ్గించ‌డంపై నాగార్జున‌ను మీడియా ప్ర‌శ్నించినగా.. నా సినిమాకు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఏపీలో వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేదు అన‌డంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో ‘బంగార్రాజు’ను బాయ్ కాట్ చేయాలంటున్నారు. ఏపీలో బంగార్రాజు సినిమాను ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని ఎగ్జిబిట‌ర్స్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement