Thursday, April 18, 2024

బోయ‌పాటికి 10 – హీరో రామ్ కి 20వ చిత్రం

అఖండ చిత్రం త‌ర్వాత ద‌ర్శ‌కుడు బోయ‌పాటి త‌న స్పీడ్ ని పెంచాడు. హీరో రామ్ తో ఓ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న కూడా జ‌రిగింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రామ్ హీరోగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమేనంటూ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా అయితే, హీరోగా రామ్ కి ఇది 20వ సినిమా. ప్రస్తుతం రామ్ లింగుసామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. త్వరలోనే బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement