Friday, March 29, 2024

మేక‌ప్ ఆర్టిస్ట్ కోసం పెళ్ళి పెద్ద‌గా మారిన హీరోయిన్ ‘శ్ర‌ద్ధాక‌పూర్’

త‌న మేక‌ప్ ఆర్టిస్ట్ , ఫ్రెండ్ శ్రద్ధానాయ‌క్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ పెళ్లి పెద్ద‌గా మారింది. కాగా త‌న ప్రియుడ్నిపెళ్లాడింది. ఈ పెళ్లిలో వ‌ధూవ‌రుల‌తో పెళ్లినాటి ప్రమాణాలు చదివించే బాధ్యతను శ్రద్ధా కపూర్ అందుకుంది. దాంతో శ్రద్ధా నాయక్ ఆనందం అంతాఇంతా కాదు. స్టార్ హీరోయిన్ అయ్యుండి స్నేహం కోసం పెళ్లిపెద్దగా మారిన ఆమె మంచి మనసును కొనియాడుతూ సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. కాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా వచ్చిన ‘సాహో’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. సెలబ్రిటీ ఇంట పుట్టినా ఎంతో సింపుల్ గా ఉంటుంది. ఆమె తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్ లో పేరున్న నటుడు. అయినప్పటికీ స్వంతగా ఎదిగి తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement