Thursday, March 30, 2023

పుష్ప నామ్ సున్ కే ఫ్ల‌వ‌ర్ స‌మ్జే క్యా- ఫైర్ హు మే అంటోన్న – అమితాబ్

బాలీవుడ్ స్టార్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ నోటి వెంట పుష్ప చిత్రంలోని డైలాగ్ వ‌చ్చింది. ‘పుష్ప నామ్ సున్ కే ఫ్ల‌వ‌ర్ స‌మ్జే క్యా.. ఫైర్ హు మే అన్నారు.బిగ్‌బీ ‘కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి’ ప్రోగ్రాంలో భాగంగా ‘పుష్ప నామ్ సున్ కే ఫ్ల‌వ‌ర్ స‌మ్జే క్యా.. ఫైర్ హు మే’ అని డైలాగ్ చెప్తూ.. పుష్ప చిత్రంలో చూపించిన ఎర్ర‌చంద‌నం, భార‌త‌దేశంలో ఏ ప్రాంతానికి చెందిన‌వి అనే క్వ‌శ్చ‌న్‌ను అమితాబ్‌ అడిగాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. పుష్ప చిత్రంలోని డైలాగ్స్ ఎంత‌గానో పాప్యుల‌ర్ అయ్యాయి. సినీప్ర‌ముఖుల నుంచి క్రికేట‌ర్ల వ‌ర‌కు పుష్ప డైలాగ్స్‌ను రీల్స్ చేశారు. ముఖ్యంగా కొంద‌రు రాజ‌కీయ‌నాయ‌కులు ఏకంగా ప్ర‌చారాల‌లో కూడా పుష్ప డైలాగ్స్‌ను వాడారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా పుష్ప‌లోని డైలాగ్‌ను చెప్ప‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement