Thursday, April 18, 2024

హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోన్న ఆలియాభ‌ట్

భారీ చిత్రాల్లో న‌టిస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్. ఆర్ ఆర్ ఆర్ తో ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. ఆలియా హాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. అది కూడా అలా ఇలాకాదు.. ఓ క్రేజీ చిత్రంలో హాలీవుడ్ స్టార్ పక్కన అలియా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే చిత్రంలో అలియా భాగం కానుంది. ఈ చిత్రంలో అలియాతో పాటు ‘వండర్ వుమెన్’ నటి గాళ్ గోబట్, ప్రముఖ నటుడు జెమీ డోర్నాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది. ఇక గాళ్ గోబట్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని షేర్ చేసింది. హాలీవుడ్ లో అలియా భట్ కి ఇది డ్రీం డెబ్యూ చిత్రం. హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రం స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఐశ్యర్యారాయ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె లాంటి బాలీవుడ్ హీరోయిన్లు హాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడు అలియా కి ఆ ఛాన్స్ దక్కింది. మరి అలియా భట్ అంతర్జాతీయ ప్రేక్షకులని మెప్పిస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement