Friday, March 29, 2024

అమానుషం | ఫుల్​గా తాగి స్కూటీని ఢీకొట్టి.. గంటన్నర పాటు, కిలోమీటర్ల దూరం కారుతో యువతిని ఈడ్చుకెళ్లారు

ఢిల్లీలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. జనవరి ఒకటో తేదీ తెల్లవారు జామున ఈ దారుణ ఘటన జరిగింది. బాగా తాగిన అయిదుగురు యువకులు కారులో పెద్ద పెద్ద సౌండ్స్​తో మ్యూజిక్​ వింటూ రోడ్లమీద రయ్​మంటూ దూసుకెళ్లారు. వారి కారుకు అడ్డు వచ్చిన ఓ స్కూటీని ఢీకొట్టి అట్లాగే దాదాపు 20 కిలోమీటర్లకు పైగా అంటే.. గంటన్నర పాటు చక్కర్లు కొట్టారు. యూటర్న్​లు తిరుగుతూ, ఆ స్కూటీపై ఉన్న 20 ఏళ్ల యువతి చనిపోయి, రోడ్డుమీద డెడ్​బాడీ పడిపోయే దాకా దారుణంగా వ్యవహరించారు. దీన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి ఈ విషయాన్ని పోలీసులకు, మీడియాకు తెలియజేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఢిల్లీలో ఆదివారం 20 ఏళ్ల యువతి స్కూటీపై వెళ్తోంది. ఆమె స్కూటీని ఢీకొట్టిన కారు.. అట్లాగే కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకెళ్లడంతో ఆమె చనిపోయింది. ఘటనను కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి ఒకరు ఈ ఘోరాన్ని వివరించారు. దీపక్ దహియా లాడ్‌పూర్ గ్రామంలోని కంఝవాలా రోడ్డులో మిఠాయి దుకాణం నడుపుతున్నారు. ఆ కారుకు చిక్కిన బాలిక మృతదేహాన్ని నిందితులు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లారని, అది దాదాపు గంటన్నర పాటు కొనసాగిందని చెప్పారు.

“ఉదయం 3:20 అయ్యింది…నేను షాప్ బయట నిలబడి ఉండగా 100 మీటర్ల దూరంలో వాహనం నుండి పెద్ద శబ్దం వినిపించింది. అయితే కారు టైరు పగిలిందని అనుకున్నాను. కారు కదిలిన వెంటనే, ఒక మృతదేహాన్ని ఈడ్చుకెళ్లడం  చూశాను. నేను వెంటనే పోలీసులకు సమాచారం అందించాను” అని దహియా తెలిపారు.

కాగా, కొంత సమయం తరువాత.. తెల్లవారుజామున 3:30 గంటలకు కారు యు-టర్న్ తీసుకుందని.. అయితే ఆ యువతి మృతదేహం వాహనం కింద ఇరుక్కుపోయిందని చెప్పారు. నిందితులు దాదాపు 4-5 కిలోమీటర్ల మేర రోడ్డుపై యూటర్న్ లు తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేశారని ఘటనగురించి వివరించారు.

- Advertisement -

“నేను చాలాసార్లు వారిని ఆపడానికి యత్నించాను. కానీ వారు ఆపలేదు. దాదాపు గంటన్నర పాటు వారు బాలిక మృతదేహాన్ని 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు’ అని తెలిపారు. అతను తన బైక్‌తో కారును కూడా వెంబడించానని, పోలీసులతో కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు దహియా చెప్పారు.

సుమారు గంటన్నర తర్వాత కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుండి మృతదేహం విడిపోయింది. ఆ తర్వాత నిందితులు పారిపోయారని చెప్పారు. “ఇది కేవలం ప్రమాదం కాదు” అని దహియా అన్నారు.ఈ సంఘటన జరిగిన సమయంలో అమ్మాయి స్కూటీ నుండి పడిపోయిందని, చాలా దూరం వరకు కారు కింద ఇరుక్కునే ఉండగా.. అట్లాగే ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోందని ఔటర్ ఢిల్లీలోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హరేంద్ర కుమార్ సింగ్ అన్నారు. కారు రిజిస్టర్డ్ నంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్టు చెప్పారు. ఘటన తర్వాత బాలిక పరిస్థితి చాలా విషమంగా ఉందని, కారుతో ఈడ్చుకెళ్లిన తర్వాత ఆమె బట్టలు, శరీరంలోని వెనుక భాగం యొత్తం చీరుకుపోయిందని పోలీసులు తెలిపారు.

ఇక.. ఈ దారుణ ఘటనను సీరియస్​గా తీసుకున్నట్ట ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ తెలిపారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. “ఢిల్లీలోని కంఝవాలాలో ఒక బాలిక యొక్క నగ్న మృతదేహం కనుగొన్నారని, మద్యం మత్తులో కొంతమంది అబ్బాయిలు ఆమె స్కూటీని కారుతో ఢీకొట్టి అనేక కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారని ఆమె చెప్పారు. ఈ విషయం చాలా ప్రమాదకరమైనది. నేను ఢిల్లీ పోలీసులకు సమన్లు ​​జారీ చేస్తున్నాను. అసలు నిజం బయటకు రావాలి’ అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

వాహనంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నారని ఆరోపించారు. “చాలా కలతపెట్టే ఘటన ఒకటి బయటకు వచ్చింది. ఓ బాలికను కారు ఢీకొట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. కారును ఐదుగురు వ్యక్తులు అతిగా మద్యం తాగి నడిపారు. బాలికకు ఎలా న్యాయం చేస్తారని అడగాలని ఢిల్లీ పోలీసులను పిలిపించాను. రెండవది, నేను అడగాలనుకుంటున్నాను. అమ్మాయిని కిలోమీటర్ల కొద్దీ ఈడ్చుకెళ్లినప్పటికీ ఏ చెక్‌పోస్టు కూడా వారిని ఎందుకు పట్టుకోలేకపోయింది. ఆ తాగుబోతులను ఎవరూ ఎందుకు ఆపలేదు. ఇది చాలా భయానకమైన.. దిగ్భ్రాంతికరమైన సంఘటన” అని విమెన్స్​ కమిషన్​ చైర్​ పర్సన్​ స్వాతి అన్నారు.

కాగా, ఆదివారం తెల్లవారుజామున కంజ్వాలా పోలీస్ స్టేషన్‌కు పీసీఆర్ కాల్ వచ్చిందని, ఒక కారు మృతదేహాన్ని దానితో పాటు లాగడం చూసినట్టు తెలిపారని పోలీసులు చెప్పారు. తెల్లవారుజామున 4:11 గంటలకు రోడ్డుపై పడి ఉన్న బాలిక మృతదేహంపై మరో  పీసీఆర్ కాల్ వచ్చిందన్నారు. ఆ తర్వాత పోలీసులు పికెట్ల వద్ద మోహరించిన అధికారులను అప్రమత్తం చేసి వాహనం కోసం సోదాలు చేపట్టారు. బాలిక మృతదేహాన్ని మంగోల్‌పురిలోని ఎస్‌జీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇంతలో అనుమానాస్పద కారును కూడా గుర్తించి ఐదుగురు వ్యక్తులను వారి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement