Wednesday, April 24, 2024

Blue Revolution: తెలంగాణలో నీలి విప్లవం… వ‌ల‌నిండా జల జ‌ల‌మ‌ని..

చెరువులు, రిజర్వాయర్లు, కుంటలను కేంద్రంగా చేసుకుని రొయ్యలు, చేపల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేప‌ట్టింది. మ‌త్స్య‌కారుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా పిల్ల‌ల‌ను వ‌దిలి వాటి సంర‌క్ష‌ణ హ‌క్కులు క‌ల్పించింది. రాష్ట్రంలో మొత్తం 24,953 చెరువులు కుంటలు రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసింది ప్ర‌భుత్వం. సర్కారు తెలంగాణ వ్యాప్తంగా రూ.10 కోట్ల వ్యయంతో 80 కోట్ల 8 లక్షల చేప పిల్లలను 26 లక్షల రొయ్య పిల్లలను పంపిణి చేసింది.

ఇప్పుడా చేప పిల్లలు పెరిగి పెద్దవి అయ్యాయి. మ‌త్స్యకారుల‌కు చేతినిండా ప‌ని దొరుకుతోంది. వ‌ల విసిర‌గానే.. వ‌ల నిండుగా రొయ్య‌లు, చేప‌లు చిక్కుతున్నాయి. నారాయ‌ణ‌పేట జిల్లాలోని ప‌లు చెరువుల్లో రొయ్య‌ల పెంప‌కం బాగా జ‌రిగింద‌ని, అవి ఇప్పుడు మ‌త్స్య‌కారుల‌కు ఉపాధినిస్తున్నాయ‌ని పేర్కొంటూ ఫొటోల‌తో ట్వీట్ చేశారు క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement