Thursday, April 18, 2024

Blood Donation – హాస్ప‌ట‌ల్స్ వ‌ద్ద వేలాది మంది ర‌క్తదాత‌లు …

ఒడిశా : బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య గంట గంట‌కు పెరుగుతున్న‌ది.. అలాగే ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికు వెయి మందికి పైగా ప్ర‌యాణీకులు గాయ‌ప‌డ్డారు.. వారంద‌రూ స‌మీపంలోని వివిద హాస్ప‌ట‌ల్స్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికోసం రక్తదానం చేయడానికి ప్రజలు క్యూ కట్టారు. వేలాదిమంది స్వ‌చ్చందంగా ర‌క్త‌దానం ఇచ్చేందుకు వివిధ హ‌స్ప‌ట‌ల్స్ త‌ర‌లివ‌చ్చారు..

కాగా.. మొత్తం 200 అంబులెన్స్‌లు, 45 మొబైల్ హెల్త్ టీమ్‌లతో పాటు 108 ఫ్లీట్‌లలో 167, 20కి పైగా ప్రభుత్వ అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో మోహరించారు.. అత్య‌వ‌స‌రంగా 200 వంద‌ల ప‌డ‌క‌ల‌తో తాత్కాలిక హాస్ప‌ట‌ల్ ను సైతం ప్ర‌మాద స్థలంలోనే ఏర్పాటు చేశారు. ఎస్‌సిబికి చెందిన 25 మంది వైద్యుల బృందంతో పాటు 50 మంది అదనపు వైద్యులు క్ష‌త‌గాత్రుల‌కు సేవ‌ల‌ను అందిస్తున్నారు..

ఇదిలా ఉండగా, ఒడిశా రైలు ప్రమాదం మీద రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపం తెలిపారు. కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ శనివారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాద కారణాల మీద ఆరా తీశారు. ప్రమాదం మీద ఉన్నత స్తాయి విచారణకు ఆదేశించారు. విచారణ తరువాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ రెస్క్యూ ఆపరేషన్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఒడిశా రైలు ప్రమాదంపై షాలిమార్, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం,తిరుపతి,బాలాసోర్, సికింద్రాబాద్,విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం,బాపట్ల,తెనాలి,నెల్లూరు, ఒంగోలు,రేణిగుంటలకు హెల్స్ లైన్లు ఏర్పాటు చేశారు. ప్ర‌మాద కార‌ణంగా మొత్తం 43 రైళ్ల‌ను ర‌ద్దు చేశారు.. మ‌రో 18 రైళ్ల‌ను దారి మ‌ళ్లించారు.. ముఖ్యంగా విశాఖ‌,భువ‌నేశ్వ‌ర్, హౌరా రూట్ లో మొత్తం స‌ర్వీస్ లు నిలిపివేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement