Thursday, April 18, 2024

ఇన్నేళ్లు గుడ్డి గుర్రం పళ్లు తోమారా.. వరి పంటపై బీజేపీ ద్వంద్వ‌ వైఖరి: కేటీఆర్‌

కామారెడ్డి (ప్రభన్యూస్‌) : వరి పంటపై బిజెపి పార్టీ ద్వంద్వ వైఖ రిని అవలంభిస్తోందని ఢిల్లీలో వద్దని తెలంగాణలో కావాలని రెండు రకాలు గా వ్యవహరిస్తుందని రైతులను పావు లుగా వాడుకొని నష్టపరుస్తుందని టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. కామారెడ్డి లో టిఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తతస్థాయి సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బిజెపి పార్టీ ప్రజలను నష్టపరిహారాన్ని అబద్దాలను ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాల విమర్శలను కార్యకర్తలు తిప్పికొట్టాలని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

నవంబర్‌ 12న కామారెడ్డి జిల్లా కేం ద్రంలో వరిపంటకు అనుమతి ఇవ్వా లని కోరుతూ టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు పోరుబాట జరపాలని పార్టీ నేత సూచించారు. నంబర్‌ 29న వరంగల్‌ లో విజయ గర్జనకు గ్రామ గ్రామాన వార్డు వార్డు నుండి కార్యకర్తలు ప్రతి కదలిరావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చా రు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను సోషల్‌ మీడియాలో తప్పులను టిఆర ్‌ఎస్‌ కార్యకర్తలు ఎదుర్కోవాలని సరైన రీతిలో సమాధానం ఇవ్వాలని ఈట్‌ కా జవాబు పతర్‌ సే దేన అని గంభీ రంగా ప్రసంగించారు. కెసిఆర్‌ నాయ కత్వంలో టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది అన్నారు.

కరెంటు సరఫరాలో సాగునీరు తాగు నీరు కల్పించడంలో టిఆర్‌ఎస్‌ ప్రభు త్వం సఫలమైందని కేటీఆర్‌ పొగిడా రు. కరెంటు సాగునీరు కల్పించడం తో లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం పెరిగిందన్నారు. బీజేపీ నేత బండి సంజరు పాదయాత్రలో అసత్య ప్రచా రాలను ప్రజలకు తీసుకెళ్తున్నారని వాటిని కార్యకర్తలు ఎండగట్టాలి అన్నారు. బిజెపి పాలిస్తున్న 18 రాష్ట్రా ల్లో తెలంగాణలో అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి 42 వేల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తూ తెలం గాణ రాష్ట్రం దేశంలోని జిడిపిలో 4వ స్థానంలో ఉందన్నారు. కెసిఆర్‌ నాయ కత్వంలో రాష్ట్రంలో తలసరి ఆదా యం పెరిగింది అన్నారు. నాలుగు లక్షల మంది బీడీ కార్మికులకు నెల నెల పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నా రు.

చావు నోట్లో తల పెట్టి కేసీఆర్‌ 14 ఏళ్ల పాటు పోరాటం చేసి 42 రాజకీయ పార్టీల ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించారు అని గుర్తు చేశారు. నిజామాబాద్‌ ఎంపీ సంజ రు మాజీ మంత్రి షబ్బీర్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నా రు. కామారెడ్డి జిల్లాను సాధించి గంప గోవర్ధన్‌ ఘనత సాధించారని ప్రశం సించారు. కుక్కలు మొరుగుతున్న ప్రతిపక్షాలను ఎదుర్కోవాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కార్యకర్తలను కోరారు. జహీరాబాద్‌ ఎంపీబీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు సురేం దర్‌, హనుమంత్‌ షిండే, గ్రంథాల య సంస్థ చైర్మన్లు శ్రీధర్‌, రాజేశ్వర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శోభ రాజు, నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ విఠల్రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నిట్టు జాహ్నవి, టిఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షు లు ముజీబొద్దిన్‌, నాయకులు నిట్టూ వేణు, జెడ్పిటిసిలు తిరుమల గౌడ్‌ ర మాదేవి, ఆంజనేయులు ప్రభాకర్‌ రెడ్డి ఇందుప్రియ, ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement