Friday, March 29, 2024

బెంగాల్లో బీజేపీకి షాక్…కేంద్ర మాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో గుడ్‌బై

పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కి భారీ షాక్ తగిలింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబూల్‌ సుప్రియో సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. దీంతోపాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని సోషల్‌ మీడియా వేదికగా బాబుల్‌ సుప్రియో తెలిపారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్‌తో పాటు ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి పెద్ద షాక్‌ ఇచ్చింది.

ఇటీవల మోదీ క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన 12 మంది కేంద్ర మంత్రులలో ఈయన ఒకరు.

పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్‌ సుప్రియో ప్రముఖ గాయకుడు. బీజేపీలో 2014 నుంచి కొనసాగుతున్నాడు. ‘అల్విదా’ అంటూ ప్రారంభించి తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సుదీర్ఘ లేఖను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement