Thursday, April 18, 2024

బీజేపీ దిద్దుబాట.. దళితుడి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసిన యోగి..

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిద్దుబాటు చర్యలకు పూనుకన్నారు. ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు బీజపీకి రాజీనామాచేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారంతా బీజేపీ అంటే సామాన్యుల పార్టీ కాదని, దళితులు, పేదలను అస్సలు పట్టించుకోలేదని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యూపీ సీఎం యోగి గోరఖ్‌పూర్‌లోని దళితుల ఇంటిలో భోజనం చేశారు.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఈ వారంలోనే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు (మిత్రపక్షాల అప్నా దళ్ నుంచి 11వ వంతు) రాజీనామా చేయడంతో బీజేపీ, యూపీ ప్రభుత్వంపై చాలా విమర్శలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ పాలనలో యూపీలో న్యాయం అనేది అందరికీ సమానంగా జరిగిందని విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో వెనుకబడిన తరగతుల సమస్యలపై యోగి ఆదిత్యనాథ్ పరిపాలన “చెవిటి” వాడి ముందు శంఖం ఊదిన చందంగా మారిందని ఈ మధ్య బీజేపీ నుంచి బయటికి వచ్చిన ఓబీసీ లీడర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ‘‘బీజేపీ అంటే సామాజిక సామరస్యంతో ఉంటుంది. ఈరోజు గోరఖ్‌పూర్‌లోని జుంగియాలో ఉన్న అమృత్ లాల్ భారతీజీ ఇంట్లో ఖిచ్డీ తినే అదృష్టం నాకు కలిగింది. చాలా ధన్యవాదాలు భారతీజీ!’’ అని ముఖ్యమంత్రి యోగి తన ట్విట్టర్‌ లో పోస్టు చేశారు.

అయితే.. యోగీ మధ్యాహ్న భోజనం వీడియోలను చాలా మంది షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. నీలిరంగు చాపపై కాళ్లకు అడ్డంగా కూర్చున్న యోగీ..దళితుడు అయిన భారతి అతని వైపు భయంగా చూస్తూ, యోగీకి ఎడమవైపు కొన్ని అడుగుల దూరంలో కూర్చుని ఉన్నారు.. అని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, మధ్యాహ్న భోజనం తర్వాత ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సమాజ్ వాదీ లీడర్ అఖిలేష్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని అప్పట్లో జరిగిన ఇండ్ల నిర్మాణం అవకతవకలపై విరుచుకుపడ్డారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేవలం 18,000 ఇళ్లు మాత్రమే ఇచ్చారని, అయితే బీజేపీ 45 లక్షల ఇళ్లు ఇచ్చిందని యోగి విమర్శలను తిప్పికొట్టారు..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement