Saturday, April 20, 2024

బీజేపీ మరింత బలోపేతం..22 మంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెలేలు జంప్…?

2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దాని కోసం వ్యూహరచ ప్రారంభించింది బీజేపీ. ఇప్పటికే మాజీ మంత్రి ఈటల బీజేపీలోకి వెళ్లడం ఖాయమైంది. ఈటల చేరికతో తమ పార్టీ మరింత బలోపేతం కానుందని బీజేపీ భావిస్తోంది. బీసీ సామాజికి వర్గాన్ని ఆకర్షించడంలో ఈటల రాజేంధర్ మరింత ప్రభావం చూపుతాడనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈటల జాయిన్ అవుతున్నాడని తెలియగానే మరి కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకొంటారి అందరూ భావించారు..కాని ఊహించినదానికంటే మూడు రేట్లు ఎక్కువగా బీజేపీలోకి వలసలు ఉన్నట్లు ఉహాగానాలు మొదలయ్యాయి.

తాజాగా బీజేపీలోకి 8 మంది మాజీ మంత్రులు, 70 మంది మాజీ MLA లు, 22 మంది సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని బీజేపీ వాట్సప్ గ్రూపుల్లో ఓ మెసేజ్ సర్క్యలేట్ అవుతోంది. అదే గనక నిజమయితే తెలంగాణలో బీజేపీ ఒక తిరుగుండకపోవచ్చి రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరంతా కూడా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారని.. బీజేపీ పక్క ప్లాన్ తోనే తమ పార్టీని బలోెపేతం చేసుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు..అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎన్ నుంచి బీజేపీలోకి వస్తున్నారనే విషయం మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏయే జిల్లా నుంచి ఎక్కువగా వలసలు ఉండనున్నాయని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎంత మంది నాయకులు బీజేపీలోకి చేరతారో వేచి చూడాల్సిందే..…?

Advertisement

తాజా వార్తలు

Advertisement