Thursday, April 25, 2024

బిర్యానీ కొంటే..ట‌మాటాలు ఫ్రీ..ఎక్క‌డో తెలుసా..

ట‌మాటా రేట్లు ఇప్పుడు అన్ని కూర‌గాయ‌ల ధ‌ర‌ల‌ను మించిపోవ‌డమే కాదు రికార్డ్ స్థాయిలో ట‌మాట రేట్లు దూసుకుపోతున్నాయి. ఏపీలో 130రూపాయ‌లు ఉండ‌గా,చెన్నైలో కేజీ 150రూపాయ‌ల ధ‌ర ప‌లుకుతోంది. వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన చెన్నైలో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపధ్యంలో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలోని అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం కొత్త ఆఫర్ ప్రకటించారు. దీంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు.

అంబూర్ బిర్యానీ షాప్‌లో ఒక కేజీ బిర్యానీ వంద రూపాయిలు.. ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే వారికి అరకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ చేశారు. ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక కేజీ బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో క్యూ కట్టారు. దీంతో యజమాని పంట పండింది. బిర్యానీకీ బాగా గిరాకీ పెరిగింది.వాణింబాడిలో రెండు బిర్యానీలు కొంటే కేజీ టమాటా ఫ్రీగా ఇస్తున్నారు. ఓ ఐడియా త‌న బిజినెస్ ని పెంచింది క‌దూ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement