Thursday, April 25, 2024

గ్రామ సచివాలయ వ్యవస్థలో మార్పులు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో గురువారం నుంచి మార్పులు చోటుచేసుకోన్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. ఇకపై ఉద్యోగులంతా సమయానికి విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న రిజస్టర్ సంతకం విధానానికి స్వస్తి చెప్పింది. గురువారం నుంచి అన్ని సచివాలయాల్లో బయో మెట్రిక్ విధానంను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి ఉద్యోగి ఆఫీసుకు వచ్చి, వెళ్లే సమయాల్లో తప్పని సరిగా బయోమెట్రిక్‌లో నమోదు చేయాలని సూచించారు. అలాగే ఇకపై ప్రతి ఉద్యోగి కూడా సచివాలయం పరిధిలోనే నివసించాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

రెండేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షలమంది వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. 2019 ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. సుధీర్ఘ పాదయాత్రలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను తీసుకురావాలని భావించిన సీఎం.. ప్రతి రెండు వేల జనాభాకు గ్రామ సెక్రటేరియెట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి 50 కుటుంబాలను కేటాయించారు. ఆ 50 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి లభించే పథకాలను చేరవేస్తారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో గ్రామాలు, పట్టణాల్లో కొత్తగా ఎవరు వస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఏంటి? ఒకవేళ కరోనా వస్తే వారిని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేయడం ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్ల పేరు ప్రముఖంగా వినిపించింది. 

ఇది కూడా చదవండి: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దారెటు?

Advertisement

తాజా వార్తలు

Advertisement