Friday, April 19, 2024

బింబిసార‌గా అద‌ర‌గొట్టిన క‌ళ్యాణ్ రామ్ .. అద్భుతంగా టీజ‌ర్ ..

టైమ్ ట్రావెల్ సోషియో ఫాంట‌సీ డ్రామా చిత్రంగా తెర‌కెక్కుతోంది బింబిసార.. ఈ చిత్రంలో హీరోగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వశిష్ఠ్ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్ర టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ లో కళ్యాణ్‌ రామ్ చాలా పవర్‌ ఫుల్‌ గా కనిపించాడు. తన నటనతో అందరిలోనూ జోష్‌ నింపాడు. బింబిసార ఏక‌ఛ‌త్రాధిప‌త్యం అంటూ చెప్పే వాయిస్ అదిరిపోయింది. రాజు గెట‌ప్ప్ లో క‌ల్యాన్ రామ్ అద‌ర‌గొట్టేశాడు. మ‌రి సినిమా ఎలా ఉండ‌నుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement