Wednesday, April 17, 2024

అతి వేగంతో గాల్లో ప‌ల్టీలు కొట్టిన బైక్ – ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన యువ‌కుడు

బైక్ పై అతి వేగంగా వ‌స్తోన్న యువ‌కుడి బైక్ అదుపుత‌ప్పింది. అంతే అదే వేగంతో ఆ బైక్ ప‌ల్టీలు కొట్టింది. అమాంతం గాలీలో లేస్తూ ఎదురుగా ఉన్న ట్రాన్స్ ఫార్మ‌ర్ కంచెలో ప‌డిపోయింది బైక్. ఆ యువ‌కుడు కూడా రోడ్డు వెంట పొర్లుతూ ట్రాన్స్ ఫార్మ‌ర్ కు కొంచెం దూరంలో వెళ్లి ఆగిపోయాడు. అంత పెద్ద ప్ర‌మాదం నుంచి అత‌డు సుర‌క్షితంగా భ‌య‌ట‌ప‌డ్డాడు. ఇదంతా క్ష‌ణాల్లో జ‌రిగిపోయింది. ఈ ప్ర‌మాదం అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ తీరంతా చూస్తే సినిమాల్లో హీరోలు చేసే స్టంట్ లాగా క‌నిపించింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు ఆ యువ‌కుడు క‌నీసం హెల్మెట్ కూడా ధ‌రించ‌లేదు. ఈ ప్ర‌మాదం విష‌యం తెలుసుకున్న అధికారులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిపివేసి బైక్ ను బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. కేరళ రాష్ట్రంలో జ‌రిగిందీ ఘ‌ట‌న‌. ఇడుక్కిలోని వెల్లయంకుడి ప్రాంతంలో విష్ణు ప్ర‌సాద్ పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement