Friday, March 29, 2024

బీహార్ లో ప్ర‌శాంత్ కిశోర్ భారీ పాద‌యాత్ర‌

బీహార్ లో భారీ పాద‌యాత్ర‌ని ప్రారంభించ‌నున్నారు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్. పశ్చిమ చంపారన్ జిల్లా నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ యాత్ర దాదాపు 12 నుంచి 18 నెల‌ల పాటు కొన‌సాగుతుంది. మొత్తంగా 3,500 కిలో మీట‌ర్ల పాటు ఈ యాత్ర చేప‌ట్ట‌నున్నారు. ఈ యాత్ర‌తో బీహార్ లో ప్ర‌శాంత్ కిశోర్ రాజ‌కీయ ఎంట్రీకి బ‌లం చేకూరుతుంద‌ని భావిస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ ఇది వ‌ర‌కే చేప‌ట్టిన ‘జన్ సూరజ్’ ప్రచారంలో భాగంగా ఈ యాత్ర చేప‌డుతున్నారు. ఈ యాత్ర లో భాగంగా ఆయ‌న ఎలాంటి విరామం లేకుండా ప్ర‌తీ పంచాయ‌తీ, బ్లాక్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. అధికారిక విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. 1917 లో జాతిపిత తన మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహార్వాలోని గాంధీ ఆశ్రమం నుండి పీకే త‌న ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మూడు ప్ర‌ధాన ల‌క్ష్యాలే భాగంగా ఈ యాత్ర కొన‌సాగ‌నుంది. ఇందులో మొట్ట మొద‌టిది అట్టడుగున ఉన్న సరైన వ్యక్తులను గుర్తించడం, వారిని ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకురావడం.విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వివిధ రంగాలలో నిపుణుల అభిప్రాయాలను తీసుకోవ‌డం. ఆ అభిప్రాయాల వ‌ల్ల రాష్ట్రానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయ‌డం వంటివి ల‌క్ష్యాల్లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement