Saturday, April 20, 2024

Bigg boss 5 winner: బిగ్ బాస్ 5 విన్నర్ VJ సన్నీ

తెలుగు రియాల్టీ షో బిగ్‌ బాస్‌ సీజన్‌-5 విన్నర్ గా వీజే సన్నీ నిలిచాడు. బిగ్‌ బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50లక్షల ప్రైజ్‌ మనీ, సువర్ణభూమి వాళ్లు అందించే రూ.25 లక్షల విలువైన ప్లాట్‌ సొంతం చేసుకున్నాడు. ఆదివారం బిగ్‌బాస్‌-5 గ్రాండ్‌ ఫినాలే అట్టహాసంగా జరిగింది. ఫినాలేలో పలువురు సినీతారల సందడి చేశారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, హీరోలు నాగచైతన్య, నాని, హీరోయిన్స్ శ్రీయ, రష్మిక, సాయి పల్లవి, అలీయ భట్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, మూజ్యిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ తదితరులు గ్రాండ్ ఫినాలేలో సందడి చేశారు.

బిగ్ బాస్ సిజన్ 5లో టాప్‌-5లో సన్నీతో పాటు షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, సిరి నిలచారు. అయితే, మానస్, సిరి, శ్రీరామచంద్ర ఎలిమినెట్ అయ్యారు. దీంతో టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్ పోటీ పడ్డారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌ డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన వీజే సన్నీ విజేతగా నిలిచినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా తన ఆట తీరు మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు. బిగ్ బాస్ సిజన్ 5లో విన్నర్ గా నిలిచాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement