Friday, April 19, 2024

Big boss 5: ఈ వారం నామినేషన్ లో ఉన్నది వీరే..

బిగ్ బాస్ సిజన్ 5 ఆసక్తికరంగా సాగుతోంది. గత వారం ప్రియ.. ఇంటి నుంచి వెళ్లగా.. ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం జరిగింది. అయితే, ఈ వారం గతానికి భిన్నంగా నామినేష‌న్ ప్రక్రియ‌ ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా ఎమోష‌న‌ల్‌గా సాగింది. ఒక‌రికొక‌రు త్యాగాలు చేయడం, ఇంటి నుండి వ‌చ్చిన లెట‌ర్స్ చ‌దివి ఎమోషన్ కావడం జరిగాయి. ఈ వారం మొత్తం ఆరుగురు స‌భ్యులు నామినేట్ అయ్యారు. లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ నామినేట్ కావ‌డంతో వారిలో ఎవ‌రు ఇంటి నుండి వెళ‌తార‌నే ఆస‌క్తి అంద‌రిలో నెలకొంది. అయితే నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా జెస్సీకి లేఖ లభించలేదని.. అతన్ని నామినేట్ చేయాలనుకుంటే ఆ లేఖను అతనికి ఇవ్వకుండా ముక్కలు చేసి నామినేట్ చేయొచ్చని సేవ్ చేయాలనుకుంటే అతని లేఖను అందించవచ్చని బిగ్ బాస్ చెప్పారు.

జెస్సీ కోసం త్యాగం చేసేందుకు ప్రియాంక‌, శ్రీరామ్ ముందుకు వ‌చ్చారు. గ‌తంలో జెస్సీ- శ్రీరామ్ మధ్య ఏర్పడిన వివాదాన్ని క్లియ‌ర్ చేసేందుకు శ్రీరామ్ త‌న లెట‌ర్‌ని త్యాగం చేయాల‌ని అనుకున్నాడు. అయితే దీనికి జెస్పీ ఒప్పుకోలేదు. చివరికి శ్రీరామ్ జెస్సీని ఒప్పించి మరీ నామినేషన్స్‌లోకి వెళ్లాడు. మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారో వీక్ ఎండ్ వరకు ఆగాల్సిందే.

ఇది కూడా చదవండి: ఏపీలో చెత్తపై పన్ను ఎందుకో చెప్పిన ఎమ్మెల్యే రోజా

Advertisement

తాజా వార్తలు

Advertisement