Friday, March 29, 2024

Bigg Boss 5: హౌస్‌ మేట్స్‌ మధ్య ‘మంట’.. నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

బిగ్‌ బాస్‌ సీజన్‌-5లో ఆసక్తికరంగా సాగుతోంది. సోమవారం ఆరో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ జరిగింది. షణ్ముఖ్‌, ప్రియాంక‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు. గతవారం సీక్రెట్‌ నామినేషన్స్‌ చేసి.. చివరిలో ఎవరు నామినెట్ అయ్యారో ప్రకటించిన బిగ్‌బాస్‌.. ఈసారి నామినేషన్స్‌ సందర్భంగా హౌస్‌ మేట్స్‌ మధ్య ‘మంట’ పెట్టాడు. హౌస్‌లో ఉండేందుకు అర్హత లేదని, తమకు ఇష్టం లేని ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటోలను మంటలో వేసి కాల్చేయాలని ఆదేశించాడు. నామినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టిన సన్నీ.. రవి, జెస్సీలను నామినేట్‌ చేశాడు. విశ్వ.. అనీ మాస్టర్‌, ప్రియాంక, లోబో.. జెస్సీ, ప్రియాంక, సిరి.. శ్రీరామ్, శ్వేత, ప్రియాంక.. లోబో, విశ్వలను నామినేట్ చేసింది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అంటూ షణ్ముఖ్‌, విశ్వలను అనీ మాస్టర్‌ నామినేట్ చేశారు. శ్రీరామ్.. సిరి, షణ్ముఖ్, కెప్టెన్‌ ప్రియ.. సన్నీ, విశ్వను నామినేట్ చేశారు. వాడీవేడీ చర్చల మధ్య ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. కాగా, ఐదో వారంలో హమీదా ఇంటినుంచి బయటకు వెళ్లగా.. మరి ఈ వారం ఎవరు సేవ్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: దుర్గమ్మ ఆలయానికి సీఎం జగన్

Advertisement

తాజా వార్తలు

Advertisement