Wednesday, March 27, 2024

BigBoss-5: ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది తనేనా? ఒర్లి ఒర్లి.. అతి చేసినందుకే చెంప పగిలిపోయిందా!

Small Screen: బిగ్ బాస్ సీజన్ 5లో అంతా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎవరి ఆట ఎప్పుడు ఎట్లా ఉంటదో అన్నది ఆ బిగ్ బాస్ కూడా క్యాచ్ చేయలేకపోతున్నాడు. ఎంత గేమ్ ప్లాన్ ఉన్నా సరే.. బిగ్ బాస్ గేమ్ లో అసలు సూత్రమేంటి అన్నది కంటెస్టెంట్స్ మరిచిపోతున్నట్టున్నారు. అందుకే ఒర్లి ఒర్లి.. ఆగమాగమైనందుకు ఈ సారి ఎలిమినేషన్ లో స్మైలింగ్ క్వీన్ ప్రియ ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ప్రియ తన గేమ్ లో భాగంగా అందరినీ రెచ్చగొట్టుడు షురూ చేసింది. ఒక్కొక్కరినీ ఎక్స్ పోజ్ చేస్తున్నాను అనుకుంది కానీ, చివరికి తనే తప్పులో కాలేసింది. అసలు ఇక్కడ ఒర్లుతున్నావు అన్నదానికి తప్పుడు అర్థం ఏమీ లేదు. దానికి గాయి గాయి చేసి.. తనే డ్యామేజీ అయ్యింది. తెలంగాణ పదం ఒర్లుడును తనకు ఇష్టం లేదనీ, అదంటే తనకు నచ్చదని చెప్పడంతో చాలా మంది నెగెటివ్ ఓటింగ్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఈసారి తక్కువ వోటింగ్ జరిగి తనే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

అయితే.. తక్కువ ఓట్లతో ఉన్న యానీ మాస్టర్ కంటే.. ప్రియ చేసిన కామెంట్స్ వల్ల తనే ప్రాబ్లంలో చిక్కుకుంది. ఈ కామెంట్స్ కనుక చేయకపోయి ఉంటే.. ఈసారి యానీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యేదని ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. కాగా, సన్నీతో జరిగిన వాగ్వాదంలో చెంప పగలగొడతా అన్నది కూడా ప్రియకు ఇబ్బంది తెచ్చిపెట్టిందనీ, సన్నీ ఎందుకు ఒర్లుతున్నావు అన్నందుకు ఆ పదం తనకు నచ్చదని, ఆ భాష నచ్చదు అంటూ వీజే సన్నీని బెదిరించిన తీరు ఆమెకు మైనస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రోజు తనే ఎలిమినేట్ అవుతుందన్న గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement