Thursday, April 25, 2024

Big Breaking : బిజెపికి షాక్ – మంత్రి స్వామి ప్ర‌సాద్ మౌర్య రాజీనామా – స‌మాజ్ వాది పార్టీలో చేరిక‌

బిజెపికి షాక్ ఎదుర‌యింది. మంత్రి స్వామి ప్ర‌సాద్ మౌర్య బిజెపికి రాజీనామా చేసి అఖిలేశ్ యాద‌వ్ నేతృత్వంలో స‌మాజ్ వాది పార్టీలోకి చేరారు. వ‌చ్చే నెల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మంత్రి నిర్ణ‌యం బిజెపికి ఎదురుదెబ్బ‌నే చెప్పాలి. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి అఖిలేష్ స‌మ‌క్షంలో స‌మాజ్ వాది పార్టీలోకి మారారు. త‌న‌తో పాటు మ‌రికొంత మంది ఎమ్మెల్యేల‌ను కూడా తీసుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. భిన్నమైన భావజాలం ఉన్నప్పటికీ, యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో అంకితభావంతో పనిచేశాను. కానీ దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులపై తీవ్ర అణచివేతకు గురవుతున్నందున రాజీనామా చేస్తున్నాను’’ అని స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో కుండబద్దలు కొట్టారు. కాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప‌ద్రౌనా నుండి బిజెపి ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. కాగా ఆయ‌న కుమారై సంఘ‌మిత్ర యూపీ నుంచి బిజెపి ఎంపీగా ఉన్నారు. మ‌రి తండ్రి రాజీనామ చేసిన నేప‌థ్యంలో ఆమె ఏ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement