Thursday, November 7, 2024

Big Breaking : తల్లి కొడుకుల ఆత్మ హత్య కేసులో – ఆరుగురికి రిమాండ్

కామారెడ్డి , ప్రభా న్యూస్…కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్న రామాయంపేట వాసులు గoగం సంతోష్ తల్లి పద్మ కేసులో రామాయంపేట కు చెందిన ఆరుగురుని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. పోలీసులు అరెస్టు చేసి కామారెడ్డి జిల్లా అదనపు జిల్లా కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అరెస్టయినవారిలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ యాదగిరి, ఐరేని బాలు గౌడ్ తోట కిరణ్ ,కన్నాపురం కిస్టగౌడ్ల , ను బుధవారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి 9వ అదనపు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అడిషనల్ ఎస్పీ అనన్య బాన్స్వాడ డిఎస్పి జైపాల్ రెడ్డి కామారెడ్డి టౌన్ సిఐ నరేష్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. ఈ కేసు A – 7 నిందితునిగా ఉన్న తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్ ను పరారీలో ఉన్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement