Friday, April 19, 2024

Big Boss: ‘నన్ను, నా బేబీని ట్రోల్ చేస్తున్నారు’.. యాంకర్ రవి వైఫ్ నిత్య‌

బిగ్ బాస్ లో ట‌ఫ్ కంటెస్టెంట్ గా యాంక‌ర్ ర‌వి ఉన్నారు. అయితే రవిని కొంతమంది సోషల్ మీడియాలో కావాలనే ట్రోల్ చేస్తున్నారని అతని ఫ్రెండ్స్‌ చెబుతున్నారు. రియాలిటీ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సహజమే.. కానీ, వాటికి కొన్ని హద్దులుంటాయంటున్నారు చాలామంది. తమకు నచ్చిన ఇంటి సభ్యుడిని పొగ‌డేందుకు.. మరొకరిని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు. గేమ్ లో భాగంగా తమకి నచ్చని కంటెస్టెంట్ ని తిట్టినా పర్లేదు కానీ, వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని ప‌ర్స‌న‌ల్‌గా మాట‌ల‌తో అటాక్ చేయడం అంత మంచిది కాద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

లేటెస్ట్‌గా ఇదే విషయంపై స్పందించిన యాంకర్ రవి భార్య నిత్య మాట్లాడుతూ.. ‘‘న‌న్ను, నా బేబీని కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇలా చేయడం స్పోర్ట్స్ స్పిరిట్ అనిపించుకోదు. అసలు మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో కూడా అర్థం కావ‌ట్లేదు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో మైండ్ గేమ్ న‌డుస్తోంది. అప్పుడు కొన్ని సందర్భాలల్లో ఇంటి సభ్యుల గురించి ముందు ఒకలాగా, వెనుక ఒకలాగా మాట్లాడినా అది గేమ్ వరకే చూడాలి. గేమ్ తో సంబంధం లేని ఇంటి సభ్యులను ట్రోల్ చేయ‌డం ఎందుకు’’ అని నిత్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement