Tuesday, April 16, 2024

బిగ్ బాస్ హౌస్ లో విశ్వ‌క్ సేన్ – ప్రోమో అదుర్స్

రీసెంట్ గా అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం చిత్రం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ప‌లు వివాదాల్లో చిక్కుకున్నారు యంగ్ హీరో విశ్వ‌క్ సేన్. కాగా బిగ్ బాస్ లోకి ఎంట‌ర్ అయ్యారు హీరో విశ్వక్ సేన్. ఈ మేర‌కు ఆయ‌న ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన‌ట్టు ప్రోమోలో చూడొచ్చు. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ చిత్రం హిట్ అయిన తర్వాతనే తాను ‘బిగ్ బాస్’ హౌజ్ కు వచ్చినట్లు విశ్వక్ సేన్ తెలిపారు. మ్యారేజ్ తర్వాత వచ్చిన ఇబ్బందులను గురించి కంటెస్టెంట్స్ ను అడిగారు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ ప్రశ్నలకు కంటెస్టెంట్స్ ఫన్నీగానే సమాధానమిచ్చారు. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ హీరోయిన్స్ తో విశ్వక్ సేన్ హ్యాపీగా ‘బిగ్ బాస్’ లో కొంచెం సేపు గడిపారు.ప్రోమోలో చివరగా ‘తింగ..తింగ..తింగరోళ్ల అటెన్షన్’ సాంగ్ కు కంటెస్టెంట్స్ తో హీరో విశ్వక్ సేన్ చిందేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement