Saturday, April 20, 2024

మోడీకి ‘భూటాన్’ అత్యున్న‌త పౌర పుర‌స్కారం : నగ్ దాగ్ పెల్ గి ఖోర్లోతో స‌త్కారం

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. భూటాన్ అత్యున్న‌త పౌర పుర‌స్కారం న‌గ్ దాగ్ పెల్ గి ఖోర్లోని మోడీకి ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు భూటాన్ ప్ర‌ధాని ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. ఇంకా ఆయ‌న ఏమన్నారంటే ఈ మేరకు భూటాన్ ప్రధాని ట్విటర్‌లో చేసిన ఒక ట్వీట్‌లో, “అత్యున్నత పౌర పురస్కారం అయిన నగ్ దాగ్ పెల్ గి ఖోర్లోకు మీ ప్రియతమ నాయకుడు మోదీజీ నరేంద్ర మోడీ పేరును హిజ్ మెజెస్టి ఉచ్ఛరించడం వినడానికి చాలా ఆనందంగా ఉంది” అని తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో భూటాన్ కు భారతదేశం బేషరతుగా మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోడీని నగ్ దాగ్ పెల్ గి ఖోర్లోతో సత్కరించాలని ఆ దేశం నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్‌లో పోస్ట్ చేస్తూ భూటాన్ పీఎంఓ ఇలా తెల‌తిపింది “ఎన్నో ఏళ్లుగా భారత్, భూటాన్ కు సహాయ హస్తం అందిస్తూనే ఉంది. ముఖ్యంగా మహమ్మారి సమయంలో భారత ప్రధాని మోడీజీ అందించిన భేషరతు సహాయం, మద్దతును మరువలేం దీన్నేహెచ్‌ఎం హైలైట్ చేసారు. మోడీ ఈ అవార్డుకు చాలా అర్హులు. ఈ సందర్భంగా ఆయనకు భూటాన్ ప్రజల నుండి అభినందనల‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement