Saturday, December 7, 2024

క్ష‌త‌గాత్రుల‌ని త‌న కారులో ఆసుప‌త్రికి త‌ర‌లించిన – భూమా అఖిల‌ప్రియ‌

క‌ర్నూలు జిల్లా సిరివెళ్ల మండ‌లం వెంక‌టాపురం వ‌ద్ద ఓ కారు ప్ర‌మాదానికి గుర‌యింది. ప్ర‌మాద‌వ‌శాత్తు రోడ్డు ప‌క్క‌న ఉన్న గుంత‌లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళుతున్న భూమా అఖిలప్రియ ప్రమాదం గురించి తెలుసుకుని తన వాహనం ఆపారు. గాయపడిన వారి పరిస్థితి పట్ల చలించిపోయిన ఆమె, వారిని వెంటనే తన కారులో ఎక్కించి నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన భూమా అఖిలప్రియను స్థానికులు అభినందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement