Saturday, April 20, 2024

భోళాశంక‌ర్ ప్ర‌త్యేక వీడియో ‘చిరు’ లుక్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయి. దాంతో ఆయ‌న బిజీ బిజీగా ఉన్నారు. కాగా ఆయ‌న న‌టిస్తున్న భోళా శంక‌ర్ చిత్రం నుండి ప్ర‌త్యేక‌వీడియోని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో చిరంజీవి కొత్త హెయిర్ స్టైల్ తో ,గూగుల్స్ పెట్టుకుని, చేతికి తాయ‌త్తుల‌తో చిరంజీవి ఆల‌రించారు. ప్ర‌స్తుతం చిరంజీవి చేతిలో ‘ఆచార్య’ చిత్రం కూడా ఉన్న విష‌యం తెలిసిందే. ఆ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాకు సంబంధించిన పాట‌లు, స్టిల్స్ విడుద‌ల చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌.

ఓ వైపు ఆ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ వ‌స్తోంటే మ‌రోవైపు ‘భోళా శంక‌ర్‌’ చిత్ర బృందం కూడా ఈ స‌ర్‌ప్రైజ్ లుక్ విడుద‌ల చేయ‌డంతో చిరు అభిమానులు ఖుషీ అవుతున్నారు. 18 క్ష‌ణాల పాటు ఉన్న ఈ వీడియో ‘భోళా శంక‌ర్ వీడియోను.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండ‌నుందో తెలిపేలా రూపొందించారు మెహ‌ర్ ర‌మేశ్‌.న్యూ ఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోళా’ అంటూ ఈ వీడియోను విడుదల చేశారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో చిరుకి జోడీగా తమన్నా న‌టిస్తోంది. ఈ సినిమాలో చిరుకి కీర్తి సురేశ్ సోదరిగా కనపడ‌నుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement