Friday, March 29, 2024

Bharat Jodo: త్వరలోనే తెలంగాణలోకి భారత్ ​జోడో.. నవంబర్​ 7వ తేదీ దాకా రాహుల్​ పాదయాత్ర

కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 31వ తేదీ న తెలంగాణలో అడుగుపెట్టనుంది. నవంబర్ 7వ తేదీ దాకా రాష్ట్రంలో పర్యటన ఉంటుందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర నవంబర్ 1 న శంషాబాద్ మీదుగా హైదరాబాద్‌లోకి ప్రవేశించనుంది. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ తెలంగాణలో భారత్ జోడో యాత్ర షెడ్యూల్‌ను ధ్రువీకరించారు.

తెలంగాణలో నారాయణపేట జిల్లా గూడెబల్లూర్ నుంచి యాత్ర కానుండగా, మక్తల్‌లో దీపావళి పండుగ కోసం మూడు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. అక్టోబర్ 27 న తిరిగి యాత్ర ప్రారంభం కానుంది. తాము భారత్ జోడో యాత్రకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర యాత్ర వివరాలను తెలియజేయడం సంతోషంగా ఉందని మాణిక్కం ఠాగూర్​ ఓ ట్వీట్​ ద్వారా తెలిపారు. అక్టోబరు 23న తమ నాయకుడు రాహుల్ గాంధీని తెలంగాణలోకి స్వాగతిస్తామని, నవంబర్ 7వ తేదీ దాకా ఆయన తెలంగాణలోనే పర్యటిస్తారని తెలిపారు. 

రాహుల్ తన పాదయాత్రను ఉదయం 6:30 నుండి 10:30 గంటలకు చేపట్టి.. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల వరకు విరామం తీసుకుంటున్నారు. మళ్లీ నాలుగు గంటల నుంచి నడక ప్రారంభించి రాత్రి 7 గంటలకు ముగిస్తున్నారు. ప్రతి చోటా సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇక.. తెలంగాణలో శంషాబాద్ మీదుగా హైదరాబాద్‌లోకి ప్రవేశించిన రాహుల్ చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నట్టు సమాచారం.

- Advertisement -

ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలోని ముత్తంగి, రుద్రారం మార్గంలో బాలానగర్, హఫీజ్‌పేట, బీహెచ్‌ఈఎల్ బస్టాండ్ మీదుగా సాగే పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తారు. నవంబర్ 4న మెదక్‌లోని జోగిపేట, పెద్దాపూర్‌ వరకు ఒకరోజు సెలవు తీసుకుని యాత్ర కొనసాగనుంది. నవంబర్ 7న, రాహుల్​ గాంధీ, అతని బృందం మహారాష్ట్రలో ప్రవేశించడానికి ముందు నారాయణఖేడ్, కామారెడ్డి జిల్లా మీదుగా ప్రయాణిస్తారు. రాత్రి నాందేడ్‌లోని దెగ్లూర్‌కు వెళ్లే ముందు రాహుల్ గాంధీ జుక్కల్‌లోని షాహాపూర్‌లోని మీర్జాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రసంగం చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement