Saturday, December 7, 2024

ముగింపు దశలో భారత్ జోడో యాత్ర.. శ్రీనగర్ లో భారీ బహిరంగ సభ

ముగింపు దశకి చేరుకుంది భారత్ జోడో యాత్ర. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌.. ఆదివారం శ్రీనగర్ లోని పంతా చౌక్ నుంచి నెహ్రూ పార్క్ వరకు నడుస్తారు. అక్కడితో యాత్ర ముగుస్తుంది. తర్వాత లాల్‌చౌక్‌ చేరుకుని.. అక్కడ త్రివర్ణ పతాకాన్ని రాహుల్ ఆవిష్కరిస్తారు. యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సభకు 12 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మొత్తం 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా 9 పార్టీల నేతలు రాకపోవచ్చని వెల్లడించాయి. డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన (ఉద్ధవ్ థాక్రే), సీపీఎం, సీపీఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేఎంఎం పార్టీల లీడర్లు ముగింపు సభకు వస్తారని, టీఎంసీ, ఎస్పీ, టీడీపీ తదితర పార్టీల నేతలు రావట్లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement