Wednesday, April 24, 2024

దేశ వ్యాప్తంగా భారత్ బంద్.. రోడ్లపైకి వచ్చిన విపక్షాలు

దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుసంఘాలు.. నేడు భారత్ బంద్​కు పిలుపునిచ్చాయి.  తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగనుంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్‌మోర్చా తలపెట్టిన భారత్‌ బంద్‌కు ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఏపీలో బీజేపీ – జనసేన మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం సైతం బంద్ కు సంఘీభావం తెలిపింది. అందులో భాగంగా మధ్నాహ్నం వరకు బస్సులను నిలిపివేస్తూ నిర్ణయించింది. మధ్నాహ్నం ఒంటి గంట తరువాత తిరిగి బస్సులు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ తో పాటుగా టీడీపీ – వామపక్ష పార్టీలు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి.

ఇటు తెలంగాణలోనూ బంద్ కొనసాగుతోంది. మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ వామపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement