Tuesday, April 23, 2024

మే 20న ఓటీటీలో భ‌ళాతంద‌నాన‌

మే 20న భళా తందనానా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది. శ్రీ విష్ణు హీరోగా.. కేథ‌రిన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు..రజినీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. మే 6 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే నెల రోజులు కూడా తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. భళా తందనానా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 20వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement