Saturday, April 13, 2024

భద్రాచలం టు పాపికొండలు.. ఆహ్లాదకరమైన గోదావరి ప్రయాణం

భద్రాచలం అనగానే దక్షిణ మధ్య ఆయోధ్యగా పేరున్న సీతారామచంద్రస్వామి దేవస్థానం పవిత్ర గోదావరి నదీ తీరం. ఇక స్వామివారి దర్శనం అనంతరం యాత్రికులు మరో ముఖ్య ప్రాంతాన్ని దర్శించుటకు వెళ్ళుటకు ఇష్టపడుతుంటారు. అదే పాపికొండలు. బహుశా పోలవరం పూర్తి అయితే పాపికొండలు చూసే అవకాశం ఇక ఉండదు. కాబట్టి యాత్రికులు పాపికొండలు టూర్ ఖచ్చితంగా వెళుతున్నారు. భద్రాచలం నుండి ఇ పోచవరం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. (వి.ఆర్.పురం మండలం తూర్పు గోదావరి జిల్లా) ఇక్కడి నుండే లాంచీ ప్రయాణం మొదలు అవుతుంది. ఇక్కడ నుండి ఆహ్లాదకరమైన వాతావరణం గోదావరి మీద ప్రయాణం చుట్టూ పచ్చదనం గుట్టల మధ్య సాగుతూ ఉంటుంది. ఒక వైపు ప్రకృతి రమణీయత మరో వైపు మన లచీలోని ఆట పాట మొదలవుతుంది. యువకులు వారి డాన్సులతో మైమరిపించారు. ఈ లోపుగానే మనం చేరాల్సిన ప్రాంతం వచ్చేస్తుంది. అక్కడ దిగిన తర్వాత శివాలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చల్లటి నీళ్లు స్వచ్ఛమైన మంచినీరు ఉంటుంది. అక్కడే యాత్రికుల అందరికీ భోజన ఏర్పాట్లు పూర్తి జరుగుతుంది. మంచి రుచి కరమైన పదార్థాలతో అందరికీ మెప్పు పొందుతారు. అక్కడ ఒక రెండు గంటలు గడిచిన తరువాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మళ్ళీ సాయంత్రం ఐదు గంటల కల్లా మన స్థలంలో క్షేమంగా చేరుస్తారు. 950 రూపాయలు టికెట్ ధర నిర్ణయించారు. టిక్కెట్లు బోటు వద్దే ఇస్తారు. భద్రాచలం నుండి ప్రయాణం ఖర్చు అదనంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement