Friday, March 29, 2024

సిద్ద‌రామ‌య్య‌..డీకే శివ‌కుమార్ కి శుభాకాంక్ష‌లు.. ప్ర‌ధాని మోడీ

క‌ర్ణాట‌క సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సిద్ధ‌రామ‌య్య‌..డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన డీకే శివ‌కుమార్ ల‌కి అభినంద‌న‌లు చెప్పారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఫలవంతమైన పదవీకాలం కోసం నా శుభాకాంక్షలు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 224 మంది సభ్యులున్న శాసనసభలో 135 స్థానాలను కైవసం చేసుకుని.. బీజేపీ నుంచి అధికారం చేజిక్కించుకుంది. ఎన్నికల్లో విజయం సాధించిన వారం రోజుల తర్వాత.. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్‌లతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌, సీపీఐ నేత డి రాజా, సీపీఐ(ఎం) సీతారాం ఏచూరిలతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement