Friday, April 19, 2024

ప‌ఠాన్ రిలీజ్ కాక‌ముందే – మ‌రో కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించిన షారుక్ ఖాన్

మ‌ళ్లీ మూడేళ్ల విరామం త‌ర్వాత ప‌ఠాన్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు బాలీవుడ్ బాద్ షా. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే మ‌రో ప్రాజెక్టు ప్ర‌క‌టించ‌డం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. పీకే మూవీ ద‌ర్శ‌కుడితో కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టించారు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. డుంకీ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న‌ ఈ ప్రాజెక్టులో ఢిల్లీ భామ తాప్సీ ప‌న్ను ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా కొత్త స్టిల్ ఒక‌టి షేర్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు షారుక్ ఖాన్.ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు షారుక్ ఖాన్‌. డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ హిరానీ , ఇత‌ర టీం మెంబ‌ర్స్ తో సెట్స్ లో దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియోలు సంయుక్తంగా డుంకీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2023 డిసెంబ‌ర్ 22న గ్రాండ్ థియేట‌ర‌ల్లో విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement